పిఏసి సభ్యులు పితాని సమక్షంలో జనసేనలో చేరికలు

*దళిత బంధు జనసేనాని పవన్ కళ్యాణ్ అంటూ.. జనసేన పార్టీ సిద్దాంతాలు, నిర్మాణాత్మక ఆలోచనలకు ఆకర్షితులైన తానేలంక పెడపేట దళిత యువకులు

తూర్పుగోదావరి జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గంలో ముమ్మిడివరం తానేలంక పెడపేట గ్రామంలో జనసేన పార్టీ సిద్ధాంతాలకు అభ్యదయ భావాలు నచ్చి వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీ చేరారు. ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి రాష్ట్ర పిఏసి సభ్యులు పితాని బాలకృష్ణ నేతృత్వంలో దళిత సోదరుల ఆత్మీయ చేరికలు కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీలో చేరుతున్న నాతి నాగేశ్వరావు, పెట్టా విష్ణు ప్రసాద్ద, జనిపల్లి ప్రశాంత్ కుమార్, శివ, జాంగా శ్రీనివాసరావు, రాధా, సుందరమ్మ, గంగా భవాని, మట్టా వెంకటేశ్వరావు వారితో సుమారు 50 మంది యువకులను, రాష్ట్ర పిఏసి సభ్యులు పితాని బాలకృష్ణ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. దళితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా 2024లో జనసేనాని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే దిశగా అందరూ ముందుకు సాగాలని, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ద్వారానే దళితులకు రాజ్యాధికారం సాధ్యం అవుతుందని ఆయన పిలుపునిచ్చారు.