దోషులను శిక్షించాలని పాలకొండ జనసేన డిమాండ్

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ జనసేన జానీ మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ ని అంతమొందించడానికి 250 కోట్ల రూపాయిలు భారీ సుపారీ చేతులు మారినట్టుగా కేంద్ర నిఘా వర్గాలకు ఆధారాలు లభించినట్టు విశ్వాసనీయంగా తెలిపారు. ఇదే నిజం అయితే జనసేన పార్టీ నాయుకులు నుంచి కార్యకర్తలు జనసైనికులు ప్రతి దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జనసేన జానీ అన్నారు. మత్స పుండరీకం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని చంపడానికి అసలు ఈ 250 కోట్లు డీల్ అమలు చేస్తున్నది ఎవ్వరు, సుపారీగా ఎవ్వరికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు దీని వెనక ఎలాంటి నాయుకులు ఉన్నరనేది ప్రజలకు తెలియాలని, త్వరగా నిఘావర్గాలు వివరాలు సేకరించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కి కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరి భద్రత కల్పించాలని కోరారు. వావిలపల్లి భూషణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి రాక్షసుడులా పాలిస్తున్నాడు, పరిపాలన బాగోలేదని ప్రశ్నస్తున్నవారిపై భౌతిక దాడులు చేస్తున్నారు. రాజ్యాంగంకి విరుద్ధంగా పాలిస్తున్నాడు. దత్తి గోపాల్ నాయుడు మాట్లాడుతూ జనంకోసం జనసేన ప్రజలకోసం పవన్ కళ్యాణ్ ఏ అధికారం లేకుండా ఎన్నో మంచిపనులు చేస్తుంటే అది తట్టుకోలేక ఈ ప్రభుత్వం పనికిమాలిన చర్యలుకు పలుపడుతుందిని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్నెన సాయిపవన్, దూసి ప్రణీత్, సొండి సుమన్, బొమ్మాళి వినోద్ పాల్గొన్నారు.