కణపాకలో పాలవలస యశస్వి పాదయాత్ర

విజయనగరం: 46వ డివిజన్ కణపాకలో గురువారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి రెండవ విడత పాదయాత్ర చేయడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ప్రజలతో సమస్య గురించి చర్చించగా.. పలు సమస్యలు యశస్వి దృష్టికి తీసుకురావడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు భావజాలని ప్రజలలోకి తీసుకువెళ్లడం జరిగింది. అనంతరం క్రియశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ చేయడం జరిగింది.