ఎన్.డి.ఏ కూటమికి మద్దతుగా పల్లె పల్లెకూ జనసేన

సింగనమల నియోజకవర్గం, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణల ఎన్నికల ప్రచారం సింగనమల మండలంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తోట ఓబులేసు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సింగనమల మండల పరిధిలోని ఇల్లూరు, ఏకుల నాగేపల్లి, కల్లుమడి, తరిమెల, నిదనవాడ, ఆనందరావుపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించమని ప్రజలను కోరడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ ప్రజలు సానుకూలంగా స్పందిస్తూ ఓటు వేసేది సైకిల్ గుర్తుపైనే అని ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకే వేస్తామని అభ్యర్థినీ గెలిపిస్తామని తెలియజేశారు. అనంతరం తోట ఓబులేసు మాట్లాడుతూ అనంతపురం ఉమ్మడి ఎంపీ మరియు సింగనమల నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిల గెలుపు కోసం మండల వ్యాప్తంగా మరియు నియోజకవర్గ వ్యాప్తంగా కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తోట రామ మోహన్, మధు, శేషు, రమేష్, మాధవ, నరసప్ప, అశ్వర్థం, మహేష్, రాము మరియు జనసేన అభిమానులు తదితరులు పాల్గొన్నారు.