Vizag: పంచకర్ల సందీప్ అధ్యక్షతన వాలంటీర్స్ మరియు భద్రతా కమిటీ

అక్టోబర్ 31న విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి వారి ఆహ్వానం మేరకు శ్రీ పవన్ కళ్యాణ్ పాల్గొనే విశాఖ ఉక్కు పరిరక్షణ సభలో భాగంగా వాలంటీర్స్ మరియు భద్రతా కమిటీ శ్రీ పంచకర్ల సందీప్ అధ్యక్షతన సమావేశం జరిగినది. ఈ సమావేశంలో 64వ వార్డు కార్పొరేటర్ శ్రీ దల్లి గోవింద్ రెడ్డి, శ్రీ దాసరి త్రినాథరావు, గుంటూరు మూర్తి, మజ్జి సత్యారావు, అట్టా అప్పారావు, ఆర్మీ గోవింద్, పవన్ పాల్గొన్నారు. అదేవిధంగా నామినేట్ చేసిన 500 మంది వాలంటీర్లు 30.10.21 శనివారం ఉదయం 08.30 గంటలకు సభా వేదిక దగ్గర జరిగే ట్రైనింగ్ ప్రోగ్రాంకు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో రావలసిందిగా మనవి చేసారు.