Razole: విజయవంతంగా శ్రమదానం చేసిన మేడిచర్లపాలెం జనసేన నాయకులు

జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రోడ్ల సమస్య మీద పోరాటంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో మేడిచర్లపాలెం గ్రామంలో రోడ్లు చాలా అధ్వానంగా ఉండడంతో శ్రమదాన కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ మేదిచర్ల వల్లీశ్వరి మరియు మేడిచర్లపాలెం జనసేన ఎంపిటిసి ముత్యాల సాయిరాం ఆధ్వర్యంలో రోడ్లకు మరమ్మత్తులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.