నేటి నుంచి ఏపీలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం

ఏపీలో ఇవాళ్టి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వానికి తెరలేవనుంది. జనవరి 31 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉండగా.. ఫిబ్రవరి 4 వరకు నామినేష్ల ఉపసంహరణకు గడువు ఉంది. 175 మండలాల్లోని 4 వేల పంచాయతీలకు తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 9న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.

అటు..రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తున్న SEC నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌.. క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం వెళ్లనున్నారు. అక్కడ అధికారులతో సమీక్ష తర్వాత సాయంత్రానికి కర్నూలు వెళ్తారు.

ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష తరువాత అక్కడే బస చేయనున్నారు. శనివారం ఉదయమే కడపకు వెళ్లనున్న నిమ్మగడ్డ.. అక్కడ కూడా సమీక్ష నిర్వహించిన అనంతరం విజయవాడకు తిరిగి వస్తారు.