హార్బర్ పేట ప్రాంతాన్ని తదేకం ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి సందర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ మండలం, హార్బర్ పేటలో నివాసం ఉండే ప్రాంతం తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు, సముద్రంలోని నీరు వచ్చి ఇళ్లు మునిగి అనేక రకాలుగా నష్టపోతున్నామని, నీరు రాకుండా గట్టు నిర్మించాలని స్థానిక మత్స్యకార పెద్దలు జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీని కోరడం జరిగింది. దానికి అయన స్పందించి తదేకం ఫౌండేషన్ వారికి తెలియచేయగా అప్రాంతాన్ని నానాజీతో కలిసి తదేకం ఫౌండేషన్ ప్రతినిధులు సందర్శించడం జరిగింది.