పొన్నూరు జనసేన ఆధ్వర్యంలో ప్రసాద వితరణ

పొన్నూరు, మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని సెంటర్లో పెదకాకాని గ్రామ పార్టీ మరియు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో భక్తుల కోసం స్వీట్ రవ్వ కేసరి, పులిహోర, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ‌ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, మండల జనసేన పార్టీ అధ్యక్షుడు వీరెళ్ల వెంకటేశ్వరరావు, పెదకాకాని గ్రామ పార్టీ అధ్యక్షులు మండలనేని శ్రీనివాస్, మండల జనసేన పార్టీ కార్యదర్శులు గుడి శివన్నారాయణ, తోకల రత్న కుమారి మురళి, సీనియర్ నాయకులు బండారు శ్రీనివాస్, బండారు అప్పారావు, కాలిశెట్టి సహదేవరావు, పెదకాకాని గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు తడవర్తి కోటేశ్వరరావు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.