మన ఊరు – మన ఆట సంక్రాతి సంబరాల్లో పాల్గొన్న పంతం నానాజీ

కాకినాడ రూరల్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మన ఊరు – మన ఆట సంక్రాతి సంబరాల్లో భాగంగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఇచ్చిన పిలుపు మేరకు సంక్రాతి సంబరాల్లో భాగంగా కాకినాడ రూరల్ మండలం తూరంగి డ్రైవర్స్ కాలనిలో జనసేన నాయకులు గోవింద్ రాజులు, తూరంగి గ్రామ అధ్యక్షులు పితాని తేజ ల సారథ్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాల్గొని ముగ్గుల పోటీలను పర్యవేక్షించి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించిన పంతం నానాజీ..ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, పెద్దలు, జనసేన, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.