ఏలూరు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

  • అగ్రహారం లోని రామకోటి మైదానంలో ఉత్సవాలు
  • ముగ్గుల పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్న 78 మంది మహిళలు
  • పోటీలో పాల్గొని గెలుపొందిన విజేతలకు రెడ్డి అప్పల నాయుడు బహుమతులు పంపిణీ

ఏలూరు నియోజకవర్గం: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు నియోజకవర్గ జనసేన ఆధ్వర్యంలో శనివారం సంక్రాంతి సంబరాల మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పల నాయుడు గారి ఆధ్వర్యంలో అగ్రహారం లోని రామకోటి ప్రాంగణంలో మన ఊరు మన ఆట కార్యక్రమంలో సంక్రాంతి సంబరాలు భోగిమంటలు, రంగవల్లులు, హరిదాసులు, ఎడ్లబండ్లు ప్రదర్శన నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి, కె.కె.గుప్తా, టిడిపి మహిళా అధ్యక్షురాలు తవ్వ అరుణ కుమారి, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, సీనియర్ నాయకులు రాఘవయ్య చౌదరి హాజరయ్యారు. సంక్రాంతి ముగ్గుల పోటీలలో మహిళలు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులను వేశారు. రెడ్డి అప్పల నాయుడు భోగి మంటను వెలిగించి సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభించారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు రెడ్డి అప్పల నాయుడు గారి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ 50 గ్రా.వెండి గిన్నె ను ఎస్.నాగమాంబ, సెకండ్ ప్రైజ్ గా 30 గ్రా.వెండి గిన్నెను దేవీ, థర్డ్ ప్రైజ్ గా 10 గ్రా.వెండి గిన్నె ను సి.హెచ్.యతీషా గెలుపొందారు..అలాగే పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ.. ముందుగా ఏలూరు నియోజకవర్గ ప్రజలకి మీడియా మిత్రులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ ప్రోగ్రాంను తలపెట్టడం జరిగిందని, ఈ సంక్రాంతి పండుగ అనేది సాంప్రదాయాలను పెంపొందించే దిశగా మహిళల్లో ఉన్న ప్రతిభను బయటకు తీసే విధంగా ముగ్గుల పోటీలు, భోగిమంటలు, గంగిరెద్దులు ప్రదర్శనలు, ఇంకా అనేక రకాల ఆటల రూపంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏలూరు అగ్రహారం లోని రామకోటి మైదానంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగిందన్నారు.. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా అభినందనలు ధన్యవాదములు.. వివిధ రంగాల్లోనే పెద్దలు అందరూ హాజరై వారి యొక్క ఆశీస్సులను మాకు అందజేశారు.. ఈ ముగ్గుల పోటీల్లో దాదాపు 75 మంది మహిళలు పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు.. మహిళలు వారి సాంప్రదాయాలు, సంస్కృతులను కళ్ళకు కట్టే విధంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారని, అలాగే ఆదివారం ఉదయం 7:00 గంటలకు 8వ డివిజన్లో శివయ్య గుడి దగ్గర ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా గారి ఆధ్వర్యంలో, అనంతరం 8:00 గంటలకు హనుమాన్ నగర్ లో వీరంకిపండు ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి మహోత్సవాలు జరుగుతాయని తెలియజేశారు.. ఈ సంక్రాంతి పండగ మన సంప్రదాయాలు సంస్కృతులను చిన్న పిల్లలకు నేర్పించే విధంగా ఉండాలని, అందరు కూడా ఆనందంతో సంతోషంగా ఉండాలని అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని వ్యాపారంలో గాని, వాణిజ్యంలో గాని, చదువులు రంగంలో గానీ, రైతాంగంలో గాని అన్ని వర్గాల వారు ఆనందంగా సుభిక్షంగా ఉండాలని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు, నగర కమిటీ సభ్యులు, నియోజకవర్గ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు భారీగా హాజరయ్యారు.