పాటంశెట్టి సూర్యచంద్ర సమక్షంలో జనసేనలో చేరికలు

జగ్గంపేట, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సింద్ధాంతాలు నచ్చి జగ్గంపేట నియోజకవర్గం, జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో నంగన లోవరాజు, నంగన రెడ్డి, నంగన వెంకటరమణ, నంగన శ్రీను, నంగన సత్యనారాయణ, కర్నాటి శ్రీను మరియు వారి కుటుంబ సభ్యులు బంధు మిత్రులతో కలిసి 40 మంది జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర సమక్షంలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి దోసపాటి సుబ్బారావు, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఎస్సి సెల్ అధ్యక్షులు బీడీల రాజబాబు, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల టైలర్స్ సెల్ అధ్యక్షులు కిలానీ శివాజీ, గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, గోకవరం మండల ఉపాధ్యక్షులు దారా శ్రీను, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సోడసాని కామరాజు, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి సింగలూరి రామ్ దీప్, రాజపూడి నుండి చీదిరి శివదుర్గ, పితాని మణికంఠ, నమ్మి చరణ్, కోట సత్తిబాబు, నమ్మి దుర్గాప్రసాద్, కీలాని మహేష్, శ్రవణ్ కుమార్, అనిల్, వినయ్, నాని మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.