India vs England: ఇంగ్లాండ్‌ను దెబ్బ తీసింది అతనే!

భారత్‌ స్పిన్‌తో దెబ్బకు అతిథ్య జట్టు అబ్బ అంది. చివరకు టెస్ట్ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. భారత స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌ (5/32), అశ్విన్‌ (4/48) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 53.2 ఓవర్లలో 145 పరుగుల చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 30.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్‌ ముందు 49 పరుగుల లక్ష్యం ఉండగా వాటిని సునయసంగా ఛేదించింది. రోహిత్‌ శర్మ (25 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), శుబ్‌మన్‌ గిల్‌ (15 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) 7.4 ఓవర్లలోనే 49 పరుగులు చేసి భారత్‌కు విజయాన్ని అందించారు.

ఇక మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌ గురించి ఎంత చె ప్పుకున్న తక్కువే.. రెండో టెస్ట్‌లో అక్షర్‌ మెుత్తం 11 వికెట్లకు కూల్చాడు. దీంతో శ్రమకు ఫలితంగా పటేల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. అక్షర్‌ పటేల్‌ ఈ టెస్ట్‌లో మెుత్తం 11 వికెట్లు తీశాడు. భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ 2-1తో టెస్టు చాంపియన్‌షిప్‌ రేసులో నిలిచింది.

మెరిసిన అశ్విన్‌ ఇక, టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టుల్లో మరో మైలురాయిని అందుకున్నాడు. టీమిండియా తరపున టెస్టుల్లో 400 వికెట్లు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్‌ను ఔట్‌ చేయడం ద్వారా అశ్విన్‌ 400 వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు. కాగా ఇంతకముందు టెస్టుల్లో టీమిండియా తరపున ఎక్కువ వికెట్లు సాధించిన వారిలో అనిల్‌ కుంబ్లే(619), కపిల్‌ దేవ్‌(434), హర్భజన్‌ సింగ్‌(417) మాత్రమే ఉన్నారు.దీంతో పాటు అశ్విన్‌ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 400 వికెట్లు సాధించిన తొలి టీమిండియా ఆటగాడిగా.. ఓవరాల్‌గా రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.