రామమందిర నిర్మాణానికి భారీ విరాళం ప్రకటించిన పవన్

అయోధ్య రామ మందిరానికి పవన్ కళ్యాణ్ తన వంతుగా విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో విపత్తులకు అందరికంటే ముందు సాయం చేసే పవన్ కళ్యాన్ ఇప్పుడు రామ మందిరానికి కూడా తెలుగు రాష్ట్రాల్లోనే సాయం ప్రకటించిన మొదటి టాలీవుడ్ హీరోతోపాటు.. మొదటి బీజేపీయేతర రాజకీయ నాయకుడిగా నిలిచాడు.

అయోధ్య శ్రీరామాలయ ట్రస్ట్‌కు రూ.30 లక్షల విరాళం ప్రకటిస్తున్నట్టు తాజాగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ.. “ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రుడు. ఆయన చూపిన సహనం, త్యాగం, శౌర్యం అందరికీ స్ఫూర్తి. భారతదేశం ఇన్ని దాడులకు బలంగా నిలబడింది అంటే అది శ్రీరామచంద్రుడు వేసిన దారే.. అలాంటి ధర్మానికి ప్రతిరూపం అయిన అయోధ్యలో ఆలయం కడుతుంటే మద్దతు తెలపాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉంది. నా వంతుగా  30 లక్షల రూపాయలు రామాలయ నిర్మాణానికి ఇస్తున్నాను. నేను ఇలా విరాళం ఇస్తున్నాను అని తెలియగానే నా వ్యక్తిగత సిబ్బంది కూడా తమ వంతుగా రూ. 11000 సమకూర్చారు. ఈ సిబ్బందిలో హిందువులే కాదు ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉన్నారు ” అన్నారు. ఈ రెండు చెక్కులను సంబంధిత ట్రస్ట్ సభ్యులకు పవన్ కళ్యాణ్ అందజేశారు.

తాజాగా తిరుపతిలో పార్టీ రాజకీయ సభలకు హాజరైన పవన్ అంతకుముందు తిరుమల శ్రీవారిని కాలినడకన దర్శించుకొని పూజలు చేశారు. పంచె కట్టుకొని ఓ శాలువ కప్పుకొని కాషాయ వస్త్రధారణతో అలరించారు.