వేములవాడ గ్రామంలో జనం కోసం పవన్ – పవన్ కోసం మనం

కాకినాడ:  జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కరప మండలం, వేములవాడ గ్రామంలో స్థానిక నాయకులు మీసాల రాంబాబు, అప్పనపల్లి మహేష్, అప్పనపల్లి మహేష్, శ్రీపాదం కృపాదానం, మీసాల శ్రీను, తలాటం వెంకటేశ్వరరావు, నక్క శ్రీనివాస్ మరియు వేములవాడ జనసైనికుల ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు తెలుకోవడానికి పాలిక వారి విధి, గణపతి కోలనీ, పోలీనాటి పేట ప్రాంతాలలో ఇంటింటికి వెళుతున్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీకి గ్రామంలో మహిళలు, ప్రజలు అనేక సమస్యలు తెలిపారు.. ఈ వైసీపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడమే కానీ రైతులకు ఏనాడూ ఉపయోగపడలేదు. వారు పండించిన పంటకి సరైన ధర ఇవ్వలేదు. రైతు పండించిన పంటను దళారులు తీసుకువెళ్లిన తరువాత రేట్ పెంచి రైతులను అప్పులపాలు చేసిన ఈ వైసీపీ ప్రభుత్వం.. సమయానికి నీరు ఇవ్వకుండా పంట భూములను బీడు భూములుగా మార్చేస్తున్నారు. రైతులు. అధికారులకి చెప్పిన పట్టించుకునే నాధుడు లేకపోవడం చాలా దారుణమని, గ్రామంలో విద్యుత్ స్తంబాలు అవసరం చాలా ఉందని తెలిపారు. మహిళలు కల్తీ మద్యం తాగి మగవాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారని, దానిని అరికట్టాలని కోరారు. మీ సమస్యలపై అధికారులు స్పందించేలా వత్తిడి తీసుకువస్తామని అలా కానీ పక్షంలో జనసేన ప్రభుత్వం వచ్చాక పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కరప మండల నాయకులు, కాకినాడ రూరల్ మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.