రమేష్ హాస్పటల్ ప్రారంభోత్సవానికి హాజరైన సువర్ణ రాజు

గోపాలపురం నియోజకవర్గం: డాక్టర్ ఈతకోట రమేష్ దుద్దుకూరు గ్రామంలో ప్రారంభించిన రమేష్ హాస్పటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అథిదిగా జనసేన పార్టీ గోపాలపురం నియోజకవర్గ నాయకులు దొడ్డిగర్ల సువర్ణ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచి వైద్యాన్ని ప్రజలందరికీ, పేదవారికి అందుబాటులో ఉండేలాగా మరింత కృషి చేయాలని డాక్టర్ రమేష్ కి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవరపల్లి మండల ప్రెసిడెంట్ కట్నం గణేష్, దేవరపల్లి గ్రామ అధ్యక్షుడు కంబాల సత్తిబాబు, చప్పటి శివ నాగ ప్రసాద్, సూరిశెట్టి బాలు, పోలిమాటి నాని, పాపోలు ప్రదీప్, అబ్బూరి రామకృష్ణ, మరియు జన సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.