మంచాల గ్రామంలో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

పొన్నూరు నియోజకవర్గం: చేబ్రోలు మండలం, మంచాల గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కోణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు జన్మదిన కేక్ ను కటింగ్ చేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వడ్రాణం మార్కండేయ బాబు మాట్లాడుతూ నేడు రాష్ట్రం అంతా పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్నిచోట్లా ఘనంగా భవన నిర్మాణ కార్మికులు, విద్యార్థిని విద్యార్థులకు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరు అభినందనీయం అని అన్నారు. ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలని మార్కండేయ బాబు కార్యకర్తలను కోరినారు. ఈ సందర్భంగా జనసేన జెండాను మార్కండేయ బాబు ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి మేకల రామయ్య యాదవ్, చేబ్రోలు మండలం అధ్యక్షులు చందు శ్రీరాములు, గ్రామ అధ్యక్షులు అన్నదాసు రామక్రిష్ణ, యువ నాయకుడు రాజేష్, రైతు నాయకులు నారిశెట్టి క్రిష్ణయ్య, కారుమంచి కోటేశ్వరరావు, యం. గోపి, జనసైనికులు, వీరమహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.