పవన్ కళ్యాణ్ అంబేద్కర్ ఆశయాలను, సిద్ధాంతాలను పాటిస్తుంటారు

ఏటూరు నాగారం, డా.బి.ఆర్.అంబేద్కర్ 131వ జయంతి సందర్బంగా ఏటూరు నాగారం ఎస్సి నేతాకాని వాడలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జనసేన ఏటూరు నాగారం సబ్ డివిజన్ యూత్ లీడర్ కొండగోర్ల వెంకి (సాయి). ఈ సందర్భంగా కొండగోర్ల వెంకి మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను ఎప్పుడు పాటిస్తుంటారని, అణగారిన బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో సామాజిక న్యాయం జరిగే వరకు జనసేన తోడుగా ఉంటుందని తెలియజేశారు. ప్రజలందరూ రాజకీయ చైతన్యం కలిగి సమ సమాజ స్థాపన చేయడంలో భాగస్వాములు కావాలని, కుల మతాలకు అతీతంగా ప్రజలు కలిసి మెలసి ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండగొర్ల పవన్ కమిటీ ఉపాధ్యక్షులు, జనసేన నాయకులు, కార్యకర్తలు గోగు బాబు, నాగరాజు, శివ, జాడి మల్లయ్య, నవిన్, పాల్గొన్నారు.