విద్యార్ధులకు పుస్తకాలు పంపిణీ చేసిన వంగ లక్ష్మణ్ గౌడ్

నాగర్ కర్నూల్, జనసేనాని పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్, జన్మదిన సందర్బంగా విద్యార్థులకు పుస్తకాల పంపిణి కార్యక్రమం నాగర్ కర్నూల్ నియోజకవర్గం బిజినపల్లి మండలం వెలుగొండ గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్ ల జన్మదినం సందర్భంగా ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న బాలికలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు భోట్కా రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెలుగొండ గ్రామ నాయకులు రాజశేఖర్, పరమేష్ మరియు మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు, నాగర్ కర్నూల్ జిల్లా నాయకులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.