రాష్ట్ర ప్రజల మంచి కోరే ఏకైక వ్వక్తి పవన్ కళ్యాణ్: జంగాల శివరామ్ రాయల్

చిత్తూరు: అందరికి అండగా నిలబడే వాడినే దత్తపుత్రుడు అంటారని, రాష్ట్ర ప్రజల మంచి కోరే ఏకైక వ్వక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనను అందరూ దత్తపుత్రుడుగా భావిస్తారని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ పేర్కొన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వైసిపి మంత్రులు, నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

ఈ సందర్భంగా జంగాల శివరామ్ రాయల్ మాట్లాడుతూ ఉద్దానం కిడ్నీ బాధిత కుటుంబాలకు దత్తపుత్రుడు, అమరావతి పేదరైతు కుటుంబాలకు దత్తపుత్రుడు, సుగాలి ప్రీతి కుటుంబానికి దత్తపుత్రుడు, భారతదేశ సైనికుల కుటుంబాలకు దత్తపుత్రుడు,
రాష్ట్ర మత్స్యకార కుటుంబాలకు దత్తపుత్రుడు, విశాఖ ఉక్కు ఉద్యోగుల కుటుంబాలకు దత్తపుత్రుడు, భవననిర్మాణ కార్మికుల కుటుంబాలకు దత్తపుత్రుడు, ఇప్పటం గ్రామ కుటుంబాలకు దత్తపుత్రుడు, కౌలు రైతుల కుటుంబాలకు దత్తపుత్రుడు అని ఈ రాష్ట్ర ప్రజలు గొంతెత్తి సగర్వంగా చెబుతున్నారని వ్యాఖ్యానించారు.