కిషన్‌రెడ్డిని కలిసిన పవన్‌కల్యాణ్‌

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయొద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కోరారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో కలిసి దిల్లీలో కిషన్‌రెడ్డిని కలిశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసే అంశంపై కిషన్‌రెడ్డితో కాసేపు చర్చించారు. ఈ అంశంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి సహకారం అందేలా చూడాలని ఆయన్ను పవన్‌ కోరారు.