పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి

  • 2024లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఖాయం
  • రాజంపేట జనసేన ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జనసేన పార్టీ రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ తెలియజేశారు. అమెరికా నుండి స్వదేశానికి వచ్చిన మలిశెట్టి వెంకటరమణ ఆదివారం జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి చెంపపెట్టు అని అన్నారు. 2014 ఎన్నికలలో ఏ పదవిని ఆశించకుండా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పాటుపడ్డారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ తీరు పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పైన ప్రజా వ్యతిరేకత ఎమ్మెల్సీ ఎన్నికలలో సుస్పష్టమైనదని, ఇదే ఉత్సాహంతో రానున్న ఎన్నికలలో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పదవులపై వ్యామోహం లేకుండా పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల భవిష్యత్తు కోసం ఎలాగైతే పాటుపడుతున్నారో తాను కూడా అదే తరహాలో పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పార్టీ బలోపేతం కోసం కృషి చేయడం జరుగుతోందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, జనసేన నాయకులు భాస్కర్ పంతులు, నరసింహులు, శంకరయ్య, ప్రశాంత్, జనసేన వీర మహిళలు జెడ్డా శిరీష, రెడ్డి రాణి, జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.