గూడూరు మండలం పోలవరం గ్రామంలో జగనన్న కాలనీ దుస్థితి

  • సరైన రహదారి లేదు
  • మెరక తోలకపోవటం వలన కాలనీ మొత్తం జలమయం

పెడన, 220 మంది లబ్ధిదారులకు ఇల్లు కేటాయించినప్పటికీ, కేవలం పది మంది లబ్ధిదారులు మాత్రమే స్లాబ్ లు వరకు నిర్మించుకున్నారు‌. మంత్రి జోగి రమేష్ తన దృష్టిని జనసైనికుల మీద కాకుండా గృహ నిర్మాణం మీద పెట్టవలసిందిగా కోరుకుంటున్నాం. జనసేన పార్టీ నిర్వహిస్తున్న జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా ఈరోజు గూడూరు మండలం పోలవరం గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు, బత్తిన హరి రామ్, గల్లా హరీష్, శ్రీరం సంతోష్ కటకం సురేష్, కటకం లెనిన్ బాబు, కటకం వీర శంకర్రావు, బండి నాగరాజు, నున్న శ్యామల రావు, పులేటి హరికృష్ణ, బొమ్మిరెడ్డి భగవాన్, నున్న నాని, పూలేటి మణికంఠ, అర్జా వెంకటేశ్వరరావు, దారా రాజేష్, యాదవం రెడ్డి వీరాంజనేయులు, దాసరి నాని, పిన్నిశెట్టి రాజు, ముద్దినేటి రామకృష్ణ, సాయి, పరమేశ్వరరావు మరియు పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.