జీలుగుమిల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

పోలవరం నియోజకవర్గం: జీలుగుమిల్లి మండల పార్టీ అధ్యక్షులు పసుపులేటి రాము ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను స్థానిక నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, పోలవరం నియోజకవర్గం ఇంచార్జ్ చిర్రీ బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా జగదాంబ ఆలయంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కొరకు పార్టీ విజయం కొరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఫ్రూట్స్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభలో భారీ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించాలని పవన్ కళ్యాణ్ తెలిపినట్లు చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కష్టపడి సినిమాల ద్వారా వచ్చిన డబ్బును పార్టీ కొరకు ఖర్చు చేస్తున్నారని, ఆత్మహత్యలు చేసుకున్న కవులు రైతుల, కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ నిరాడంబర జీవి అని, ప్రజల కోసం పార్టీ కార్యకర్తల కోసం ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కవరేజ్ కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని అధిక మెజారిటీతో గెలిపించి పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని జనసేన నాయకులు, కార్యకర్తలు, సైనికులకు పిలుపునిచ్చారు. సిరి బాలరాజు మాట్లాడుతూ జనసేనతో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, గ్రామాల అభివృద్ధి కుటుంబాల సంక్షేమం జరగాలి అంటే పవన్ కళ్యాణ్ సీఎం గా చూడాలని కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి రాము మండల ప్రధాన కార్యదర్శి వేరంకి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో యాకులగూడెం గ్రామంలో యు పీ స్కూల్ లో విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పంపిణీ చేశారు. సందర్భంగా పేదలకు భోజనాల ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో చిరి రాంపండు, కురం వెంకటేశ్వరరావు, బండారు అనిల్ కుమార్, మందపాటి సూర్యచంద్ర రావు, కొల మధు, నుపా సత్యనారాయణ, శ్రీనివాసరావు, మంగరాజు, రాయి సుబ్బారావు, కల్లూరి దావీదు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.