పొంగుటూరులో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

పోలవరం నియోజకవర్గం: కొయ్యలగూడెం టౌన్, పొంగుటూరు గ్రామంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను మండల అధ్యక్షులు తోట రవి, టౌన్ అధ్యక్షులు మదేపల్లి శ్రీను, గ్రామ పార్టీ అధ్యక్షులు గాజుల చంద్రశేఖర్, గాలం సూర్య భాస్కరరావు ఆధ్వర్యంలో ముఖ్య అతిధులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, పోలవరం నియోజకవర్గం ఇంచార్జ్ చిర్రి బాలరాజు హాజరై పలు సేవా కార్యక్రమాలు గ్రామంలో నిర్వహించి, కేక్ కట్ చేసి ఘనంగా పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రాథమిక పాఠశాల స్కూల్ విద్యార్థులకు ఫ్యాడ్లు, పెన్నులు, బుక్స్, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలవరం నియోజకవర్గం ఇంచార్జ్ సిరి బాలరాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకోవడమే కాదని ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా అన్నారు పరిశుద్ధ కార్మికులతో సహబంతి క్రియాశీలక సభ్యత్వాలు భరోసా కల్పించడం జరుగుతుందని, మన అధినేత పవన్ కళ్యాణ్ కష్టపడి సినిమాల ద్వారా వచ్చిన డబ్బును ప్రజా సేవకే ఉపయోగిస్తున్నారని, జనసైనికులకు ఆయన చేసిన సేవలు అమోఘమని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు సహాయం చేసి ఆర్థిక భరోసా కల్పించారని, పవన్ కళ్యాణ్ బర్త్డే అంటే సేవా దినంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రగడ రమేష్ ప్రగడ సురేష్ పసుపులేటి రాజు మరియు జనసేన యూత్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.