శ్రీకాళహస్తిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నాయకులు, కార్యకర్తలతో కలిసి చెయ్యడం జరిగింది.

ప్రోగ్రాం 1 : శ్రీకాళహస్తి పట్టణంలో భవన నిర్మాణ కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి, అన్నదానం మరియు వారితో కలిసి సహపంక్తి భోజనాలు చెయ్యడం జరిగింది.

ప్రోగ్రాం 2 : శ్రీకాళహస్తి పట్టణం రోటరీ క్లబ్ నందు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించి పెద్ద ఎత్తున రక్త దానం చెయ్యడం జరిగింది.

ప్రోగ్రాం 3 : తొట్టంబేడు మండలం, పొయ్యమ్మ యస్.టి కాలనీని సందర్శించి మహిళలకి చీరల పంపిణీ చెయ్యడం జరిగింది.

ప్రోగ్రాం 4 :
ఏర్పేడు మండలంలో బారీ కేక్ కట్ చేసి, బిసి హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చెయ్యడం జరిగింది.

ప్రోగ్రాం 5 :
రేణిగుంట పట్టణంలో ధివ్యాంగుల ఆశ్రమం అయిన అక్షయ క్షేత్రం నందు దువ్యాంగులతో కలిసి కేక్ కట్ చేసి వారికి వీల్ చైర్స్ మరియు వాకర్స్ వితరణ చెయ్యడం జరిగింది.

ఈ కార్యక్రమాలలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, జిల్లా కార్యదర్శి కొట్టే సాయి, ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివ కుమార్, నాయకులు తోట గణేష్, పేట చిరంజీవి, పేట చంద్ర, సురేంద్ర, నితీష్ కుమార్, వాకాటి బాలాజీ, వెంకటరమణ, భాగ్యలక్ష్మి, మన్నసముద్రం చంద్ర, జనసైనికులు మోహన్, వినోద్, శీను, సింగమల గోపి తదితరులు పాల్గొన్నారు.