తిరుపతిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

తిరుపతి: జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం వైకుంటపురం ఆర్చ్ వద్ద భవన నిర్మాణ కార్మికులకు, ఆశ్రయ, నవజీవన్ ఆశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు, పార్టీ ఆఫీస్ వద్ద రక్తదాన కార్యక్రమాలు, మరియు పలుసేవ కార్యక్రమాలు చేసి, బర్త్ డే కేకులను కట్ చేసి పెద్ద ఎత్తున జనసేనాని జన్మదిన వేడుకలు జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, అభిమానులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, మరియు ముఖ్య నాయకులు మాట్లాడుతూ ప్రపంచం మొత్తం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక పండగలా పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారని, మా పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపుమేరకు జనశ్రేణులఅందరూ పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారని, రేపు రాబోయే 24 ఎలక్షన్లో ఈ రాష్ట్రానికి కచ్చితంగా పవన్ కళ్యాణ్ నే ముఖ్యమంత్రి అయ్యి తీరుతారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలలో జనసేన నాయకులు, జనసేనసైనికులు, వీరమహిళలు, మెగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.