తిరుపతిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

  • మెగా రక్తదాన కార్యక్రమం నిర్వహించి కేక్ కట్ చేసిన జనసేన శ్రేణులు
  • తిరుచానూరులో గల నవజీవన్ ఆశ్రమంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

తిరుపతి, సెప్టెంబర్ 2 తేదీన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం తిరుపతిలో మెగా రక్తదాన కార్యక్రమం నిర్వహించి బర్తడే కేకును కట్ చేసి ఒక పండగ వాతావరణంలా బర్త్ డే వేడుకలను నిర్వహించిన తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్, ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు సుమన్ బాబు, టౌన్ సెక్రటరీ హేమంత్, మరియు గుడి శ్రీనివాసులు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ మా అధినేత పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసుకోవడమే మా లక్ష్యంగా భావిస్తూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పనిచేయాలని పవన్ కళ్యాణ్ ఆసియా సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని అధికార పార్టీ అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు అంటగడుతూ ప్రశ్నించి ప్రజలకు మేలు చేకూర్చే విధంగా తిరుపతిలో ప్రతి ఒక్కరు పార్టీ కోసం పాటుపడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కొండా రాజమోహన్, శివ, బాలాజీ, బాలు, లికిత్, జగదీష్, సంతోష్, కౌషిక్, కిషోర్, మురళీకృష్ణ, ఉదయ్, పూరషోత్తం, జయ కుమార్, యశ్వంత్, దిలీప్ రాయల్, రవి, మరియు జనసేన నాయకులు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అదేవిధంగా తిరుచానూరులో గల నవజీవన్ ఆశ్రమంలో పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని వారు నిత్యవసర సరుకులు పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించి, బర్త్ డే కేక్ ను తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్ పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి మరియు ముఖ్య నాయకులు జనసైనికులు వీరమహిళలతో కలిసి కట్ చేసి పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి లు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ యొక్క సేవ స్ఫూర్తిని ప్రతి ఒక్క జనసేన నాయకులు, వీర మహిళలు జనసేనసైనికులు తప్పకుండా పాటిస్తారని, ఆయన ఆశయ సిద్ధాంతాలకు మంత్రముగ్ధులై ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుంటారని మంచి మనసున్న పవన్ కళ్యాణ్ ను రేపు రాబోవు ఎలక్షన్లలో ప్రజలు పట్టడం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని, మరొక్కసారి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, పట్టణ స్థాయి మరియు ముఖ్య నాయకులు, వీరమహిళలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.