విజయనగరంలో అత్యంత వైభవంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

విజయనగరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన పార్టీ విజయనగర అసెంబ్లీ ఇంచార్జ్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. విజయనగరం నడిబొడ్డున రెండు వేల బైకులు 20 కార్లతో భారీ బైక్ ర్యాలీ కనుల విందుగా జిల్లా నాయకులు, వీర మహిళలు జనసైనికులు విజయవంతం చేయటం జరిగింది అదే విధిగా పుట్టిన రోజు సందర్బంగా 5 రక్తదాన శిబిరాలు, భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనాలు, బడుగు బలహీన వర్గాల హాస్టల్ లో రెండు చోట్ల పుస్తకాలు, ప్లేట్ లు, పెన్నులు పంపిణి మరియు రెల్లి కులస్తుల కాలనీలో కేక్ కటింగ్, పుస్తకాలు, బిస్కెట్లు పంపిణి ఇంకా దివ్యాంగులకు పండ్లు, స్వీట్లు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమాలన్ని వీర మహిళలు, జనసైనికులు సహకారాలతో చేయటం జరిగిందని జనసేన పార్టీ విజయనగర అసెంబ్లీ ఇంచార్జ్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి తెలిపారు.