వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు

పీలేరు: పవన్ కళ్యాణ్ ఏలూరు సభలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడిన మాటలని వక్రీకరిస్తూ వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు చేస్తున్న నిరసనలపైన జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కలప రవి, పీలేరు మండల అధ్యక్షులు మోహన్ కృష్ణల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ గ్రామ వాలంటీర్ల వ్యవస్థని వైసీపీ ఏ విధంగా పరిమితులకి మించి ఉపయోగిస్తోందో ప్రజా ప్రయోజనాలని ఏ విధంగా దెబ్బ తీయగలరో క్షుణ్ణంగా వివరించారు. వాలంటీర్ల దగ్గర ఉన్న ప్రజల సమాచారాన్ని ఎంత వరకు గొప్యంగా ఉందొ తెలియని పరిస్థితులు ఉన్నాయన్నారు. వారి దగ్గర ఉన్న ప్రజల ఆధార్ వివరాలు, బ్యాంకు వివావరాలు, భూముల వివరాలు, ఇతరత్ర వివరాలు సంఘవిద్రోహుల చేతిలోకి వెళితే తీవ్ర పరిణామాలు చోటు చేసుకోవచ్చని, వాటికి వైసీపీ ప్రభుత్వం భాద్యత వహిస్తుందా అని ప్రశ్నించారు. సమావేశంలో కేవి పల్లి అధ్యక్షులు మహేష్, వాయల్పాడు నుండి దేపని ప్రభాకర్, పీలేరు మండల ప్రధాన కార్యదర్సులు పవన్ కుమార్, గజేంద్ర, గాయత్రీ, దిలీప్, నవీన్, హరీష్, కార్యదర్సులు రాంచరణ్, రికేష్, సాయి, వెంకటరమణ, మనోజ్, షఫీ, పాల్గొన్నారు.