పవన్ సిఎం అవ్వాలి: వైసీపీ నాయకులు తూము రమణ

పాయకరావుపేట నియోజకవర్గం, అరట్లకోట గ్రామానికి చెందిన వైసిపి నాయకులు, గ్రామ ఉపసర్పంచ్ తూము రమణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని ఆదివారం షిరిడీలో ఉన్న సాయిబాబా దర్శనం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ 2024లో ముఖ్యమంత్రి అవ్వాలని ప్లకార్డు ప్రదర్శించారు. తొందరలోనే తన వర్గంతో నియోజకవర్గ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో పార్టీలో చేరబోతున్నట్టు తెలియజేసారు.