200వ రోజుకు చేరుకున్న పవనన్న అన్నంబండి కార్యక్రమం

  • 200 రోజుల నుండి పేదల ఆకలి తీరుస్తున్న జనసేన నాయకుడు సిద్దు
  • కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి మున్వర్ భాష
  • సిద్దు సేవలు అభినదనీయం
  • పేదవారి ఆకలి తీర్చడమే నా లక్ష్యం సిద్దు

ఆత్మకూరు: డొక్కా సీతమ్మ స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ ఆశయంతో జనసేన నాయకుడు సిద్దు ప్రారంభించిన పవన్ అన్న అన్నం బండి ద్వారా 200వ రోజు కావలి స్థానిక ఏరియా హాస్పిటల్ నందు వందమందికి పైగా పేదలకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో మణుక్రాంత్ మాట్లాడుతూ 200రోజుల నుండి పవనన్న అన్నంబండి ద్వారా సిద్దు పేదల ఆకలి తీర్చడం గొప్ప విషయమని, పార్టీ కోసం కస్టపడి పని చేసే వాళ్లని అధిష్టానం ఖచ్చితంగా గుర్తిస్తుందని పవన్ కళ్యాణ్ అభిమానిగా సిద్దు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడని పార్టీ బలోపేతం కోసం చాలా బలంగా పని చేస్తున్నాడని తెలిపారు. సిద్దు మాట్లాడుతూ చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి ఎంతోమంది పేదలు వైద్యం కోసం కావలి ఏరియా హాస్పిటల్ వద్దకు వస్తారని వీళ్లంతా ఆకలితో కడుపు మాడ్చుకుని ఇంటికి వెళ్లడం తాను గమనించానని, వీళ్లందరి కడుపు నింపడమే లక్ష్యంగా తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాన్ని నెరవేర్చాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా భోజనం అందించే వరకూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించి పేద ప్రజల ఆకలి తీరుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు తోట శేషయ్య, ఆత్మకూరు జనసేన నాయకులు చిన్నా, ఆత్మకూరు బాబీ, సురేంద్ర నాయుడు, తోట సాయి, చిన్నా, జోషి, చేవూరు సాయి, కరీమ్, మోహిద్, వాహిద్, హరీష్, నవీన్, బ్రహ్మయ్య, కార్తీక్, మనోహర్, కమల్ పాల్గొన్నారు.