జనసేన తోనే మార్పు సాధ్యం

రాజంపేట నియోజకవర్గం: సుండుపల్లి మండలం లోని పలు గ్రామాలలో కొండల్ తూర్పు, బడిసి లంక, తిమ్మసముద్రం, పాపన్నగారి పల్లి, కేతిరెడ్డిగారిపల్లి, గడ్డమీదపల్లి, నైనారివరిపల్లి, సుంటావారిపల్లి లలో 139వ రోజు పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమాన్ని రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు సుండుపల్లె వీర మహిళ సుగుణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ, వాటిని ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగ వారు మాట్లాడుతూ, జనసేన తోనే మార్పు సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య అన్నారు. మండలంలోని ప్రజలు జనసేన తెలుగుదేశం పార్టీకి ప్రజలు నీరాజనాలు అర్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు జగన్ రెడ్డి పరిపాలన విసుగెత్తి ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపిపార్టీ మద్దతుదారున్ని ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు ఎం. వెంకటేశ్వరరావు, పోలిశెట్టి శ్రీనివాసులు, చౌడయ్య, కత్తి తదితరులు పాల్గొన్నారు.