చేనేత సమస్యలను పరిష్కరించండి.. జౌళి శాఖ అధికారికి పవనన్న చేనేత బాట వినతిపత్రం

  • చేనేత సమస్యల పరిష్కారం కొరకు బాపట్ల జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అధికారికి వినతిపత్రం ఇచ్చిన “పవనన్న చేనేత బాట యువకులు

చీరాల: చీరాల నియోజకవర్గంలో గత 154 రోజులుగా జనసేన పార్టీ తరుపున పవనన్న చేనేత బాట అనే కార్యక్రమం ద్వారా చేనేత కళాకారులూ(కార్మికులు) ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకోవడానికి క్షేత్రస్థాయి పర్యటన చేస్తూ వేటపాలెం మండలం పూర్తిచేయడం జరిగింది. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో చేనేత కళాకారులూ ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సమస్యలను గుర్తించడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం తరుపున ఎటువంటి భరోసా కలిపించగలుగుతారు అనే దాని మీద జనసేన పార్టీ చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జనసేన పార్టీ చీరాల నియోజకవర్గ యువత ఆధ్వర్యంలో చీరాలలో ఉన్న బాపట్ల జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అధికారి జే.ఆర్ రాజవర్ధన్ ని కలిసి సమస్యల పరిష్కారం సంబందించిన వినతి పత్రం ఇవ్వడం జరిగినది. జనసేన పార్టీ గుర్తించిన మొత్తం పది రకాలైన సమస్యలను వివరించడం జరిగినది. వీటిలో ముఖ్యమైన అధిక విద్యుత్ ధరల సమస్య మీద, చేనేత అనుబంధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు కూడా నేతన్న నేస్తం పధకం వర్తించే విధంగా, చేనేత గర్భిణీ మహిళలు గర్భధారణ సమయంలో కోల్పోయే ఉత్పత్తి మీద తగిన భరోసా ఇప్పించే విషయంలో, చేనేత వయోవృద్ధులు ప్రత్యేక పెన్షన్ సదుపాయం కల్పించే విషయంలో, ఇంటి స్థలాలు ఇచ్చే సమయంలో మగ్గం నేసె చేనేత కుటుంబాలకు మగ్గం పెట్టుకునే విధంగా తగిన స్థలం మంజూరు చేసే విధంగా సంబంధిత కమిషనర్లకు పంపి పైన పేర్కొన్న సమస్యలకు పరిష్కారం లభించే విధంగా ప్రయత్నం చేస్తాను అని చెప్పడం జరిగినది. వృద్ధాప్యంతో మగ్గం నేయ లేని చేనేత కార్మికులు వేరే ఉపాధి లోకి మారాలి అనుకుంటే ఆయా వ్యక్తులను గుర్తించి సమాచారం ఇస్తే వాళ్ళఅందరికి తనకు ఉన్న అధికార పదవిని ఉపయోగించుకుని సంబంధిత బ్యాంకులలో లోన్లు ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తాను అని జే.ఆర్ రాజవర్ధన్ అత్యంత ముఖ్యమైన హామీ అనేది ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో కర్ణ కిరణ్ తేజ్, వరం బూడిద, పసుపులేటి సాయి, పింజల సంతోష్, ఆమోదగిరిపట్నం జనసేన యువకులు వరుణ్, లంక భార్గవ్, గుంటూరు యువరాజ్, చేనేతపురి జనసేన యువకులు వద్ధి తేజ, పాముజుల బాలవెంకట సుబ్బారావు, చీరాల పట్టణ జనసేన యువకులు షేక్ బాషా, గొర్ల రఘురాం, వావిలపల్లి రవి, నీలకంఠాపురం జనసైనికుడు పింజల దేవి వరప్రసాద్ మరియు కడకుదురు జనసేన నాయకుడు తోట అశోక్ చక్రవర్తి పాల్గొన్నారు.