జనసేనలోకి మాల ఐక్యవేదిక అధ్యక్షుడు తిర్రే రవి దేవా

ఉండ్రాజవరం: విద్యార్థి దశ నుంచే నాయకునిగా 25 వసంతాల అనుభవంతో అనేక ప్రజా పక్ష పోరాటాలతో పేరొందిన తిర్రే రవిదేవా, దళిత ఉద్యమాలతో అణగారిన వర్గాల అభ్యున్నతికై, దళిత హక్కుల సాధనలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా రాజ్యాంగబద్ధమైన ప్రజా పోరాటాలతో ఎన్నో దళిత ఉద్యమాలు చేపట్టిన జాతీయ దళిత ఉద్యమ నేత రవిదేవా, చిరంజీవి అభిమానిగా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని ప్రజారాజ్యం పార్టీ స్థాపన అనంతరం రాజకీయాలపై ఆసక్తి తో పశ్చిమగోదావరి జిల్లా యువజన కార్యదర్శిగా ప్రజా రాజ్యం పార్టీలో సేవలందించారు. అనంతపరిణామాలతో రాజకీయాలకు అతీతంగా దళిత ఉద్యమాల్లో తనదైన శైలిలో ఉభయ రాష్ట్రాల్లో దళిత హక్కులకై పోరాడుతూ యువతలో బహుళ ప్రచుర్యం పొంది దళిత పోరాటాల్లో ప్రత్యక్షంగా చురుకైన పాత్ర పోషిస్తూ జాతీయస్థాయిలో మాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు తిర్రే రవి దేవా బుధవారం రాజమండ్రిలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొణిదెల నాగబాబు సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. మాల ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు తిర్రే రవిదేవా ఈ సందర్భంగా మాట్లాడుతూ చిరంజీవి అభిమానిగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకై, విలాసవంతమైన జీవితాన్ని ప్రజల కొరకు త్యాగం చేస్తూ అనుక్షణం తన అభిమానుల కోసం, భావితరాల భవిష్యత్తు కొరకు జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలకు ఆకర్షితుడై, ఒక్క పవనిజం ద్వారా మాత్రమే కులాలకు మతాలకు అతీతమైన సమాజ స్థాపన జనసేనతోనే సాధ్యమని తన అనుచరగణంతో పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నిడదవోలు నియోజకవర్గం ఇంచార్జి ప్రియా సౌజన్య మాట్లాడుతూ జనసేన కుల మతాలకు అతీతంగా ప్రజా పక్షాన ఉంటుంది అనడానికి జాతీయ దళిత నాయకుడు తిర్రే రవిదేవా చేరిక ఉదాహరణ అని అన్నారు. కాల్దారి గ్రామం నుండి లంకోజుల మాణిక్యం మరియు రవిదేవా అనుచరులు జనసేన పార్టీలో చేరారు, ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరం మండలం అధ్యక్షుడు వీరమళ్ళ బాలాజీ, కె.సావరం ఎంపీటీసీ కాకర్ల కరుణాకర్, రంగా రమేష్, జవ్వాది వినయ్, కైగా ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.