ఆత్మకూరులో పవనన్న ప్రజాబాట

ఆత్మకూరు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 10 గంటలకు ఆత్మకూరు జనసేన పార్టీ కార్యాలయం నుండి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుందని, జనసేన పార్టీ ఇన్చార్జిగా ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికై తాను పాటుపడతానని తెలియజేశారు. దశాబ్దాలుగా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజానీకం అన్ని రంగాల్లో దగాకు దోపిడీకి గురికాబడ్డారని పేర్కొన్నారు. దశాబ్దాలుగా దగా పడ్డ ఆత్మకూరు ప్రజల గొంతుకై జనసేన పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ అన్న ప్రజా బాటకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. దశాబ్ద కాలంగా వేదనకు గురికాబడుతున్న చుక్కల భూముల రైతన్నలకు, సుమోటోగా సమస్యను పరిష్కరిస్తామని, ఆనం సంజీవరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి నియోజకవర్గ మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని, సమగ్ర సోమశిల పథకం ద్వారా నియోజకవర్గంలోని అన్ని చెరువులకు సాగునీరు సరఫరా చేస్తామని, సంగం బ్యారేజ్ బ్యాక్ వాటర్ నుండి సంగం, ఏ.ఎస్.పేట, చేజర్ల మండలాలకు చెందిన మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందే ఏర్పాటు చేస్తామని, నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే మార్గానికి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా సత్వరమే నిధులు విడుదల చేసి ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యే విధంగా చూస్తామని, ఆత్మకూరు ఇండస్ట్రియల్ సెజ్ నుండి తరలిపోయిన పరిశ్రమల స్థానంలో, భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకుందామని, ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేద్దామని ఈ సందర్భంగా తెలియజేశారు. స్థానిక మున్సిపల్ బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఏ విధంగా సత్యం సెంటర్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి కూడా పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ పవనన్న ప్రజా బాట కార్యక్రమానికి బాసటగా విచ్చేసిన నెల్లూరు సిటీ జనసేన పార్టీ నాయకులు కేతమ్ రెడ్డి వినోద్ రెడ్డి, సుళ్ళూరుపేట ఇంచార్జ్ ఉయ్యాల ప్రవీణ్, వీరమహిళ శిరీష రెడ్డి మరియు ఆత్మకూరు నియోజకవర్గ అన్ని మండలాలకు చెందిన నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జనసైనికునికి పేరుపేరునా తన ధన్యవాదాలు తెలియజేశారు.