ప్రజా సమస్యలపైనే పవన్ దృష్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే జగన్ ఆరాటం: కోన తాతారావు

గాజువాక, రాష్ట్రంలోని ప్రజా సమస్యల పరిష్కారానికై పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తుంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఆరాటపడుతున్నారని జనసేన పార్టీ పిఏసి సభ్యులు కోన తాతారావు తెలిపారు. ఆదివారం నగరంలోని డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని రాక్షస పాలనలోకి నెట్టిందని ఆరోపించారు. కేవలం జనసేన సభకు ఇప్పటం గ్రామస్తులు స్థలం ఇచ్చారనే కక్షతో 53 ఇళ్ళను అన్యాయంగా కూల్చి వేశారన్నారు. ఆ గ్రామానికి ఆర్టిసి బస్సు వెళ్ళే పరిస్తితి లేదని, మంగళగిరి,తాడేపల్లి నగర పాలక సంస్థ మాస్టర్ ప్లాన్ లో కనీసం 20 అడుగుల రోడ్ లేనప్పుడు 100 అడుగుల రోడ్డు వెడల్పు సాకుతో ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. సి.ఆర్.డి.ఏ ప్లాన్లో కూడా చెప్పలేదు. ప్రైవేట్ స్థలం అయితే ముందుగా నోటీసులు ఇచ్చి, నష్టపరిహారం చెల్లించి రోడ్లు వేయాలని, అలా చేశారా అని అడిగారు. జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబని ఎవరికి తెలియదని. ఒక గంట మంత్రి, సుకన్య రాంబాబు అని మాత్రమే తెలుసని, కనీసం నీటిని కొలవడంలో క్యూసెక్కులకు, ఇన్ ఫ్లో కు, టి.ఎం.సిలకు అర్థమే తెలియని మంత్రి అంబటి. అలాగే జోగి రమేష్ ఇప్పటంలో ఒక ఇల్లు కూడా కూల్చలేదంటున్నారు అలా అయితే మీడియా అబద్ధాలు ఆడుతుందంటారా లేక మీరు జగన్ మెప్పు కొరకు బానిసగా మాట్లాడుతున్నారా అని అన్నారు. పవన్ కళ్యాణ్ వారానికి ఒకరోజు వస్తారని మంత్రి అమర్నాథ్ అంటున్నారని, అలా అయితే ముఖ్యమంత్రి జగన్ 15 రోజులకి ఒకసారైనా తాడేపల్లి పాలస్ నుంచి బయటకురారని, రోజూ ప్రజల ముందుకు రమ్మని మీ శాడిస్టు సిఎం కు చెప్పండి. విజయ సాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అనే నలుగురు రెడ్డిలతో కూడిన ప్రేమిలో ఉన్న టెంట్లో జగన్ పాలన నడుస్తుందని, వీరంతా దసపల్లా, రుషికొండ, బోగాపురం ఎయిర్పోర్ట్, హాయగ్రీవ, బయ్యారం భూములతోపాటు రాష్ట్రంలో ఖరీదైన భూములను కాజేస్తున్నారని ఆరోపించారు. పవన్ అంటే అంత భయమెందుకు? ఓటమి భయంలో ఫ్రస్ట్రేషన్ లో ఉండి విధాన పరమైన విమర్శలు చేయకుండా కేవలం రెచ్చగొట్టే విధంగా విమర్శలు చేయడం బానిసబ్రతుకులకు అద్దం పడుతుందన్నారు. తాడేపల్లి నుండి వచ్చిన స్క్రిప్ట్ ను మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్ వల్లిస్తుంటారన్నారు. అంబటి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయలేక పోయారని, అమర్ ఒక్క పరిశ్రమను విశాఖకు తీసుకు రాలేదని, అటువంటివారు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయుటానికి సిగ్గు ఉండాలన్నారు. రోజు రోజుకీ పవన్ కళ్యాణ్ కు పెరుగుతున్న ఆదరణ చూడలేక పోతున్నారని, త్వరలోనే రాష్ట్ర ప్రజలు వైసీపీని భూస్థాపితం చేస్తారని జోస్యం చెప్పారు. పవన్ పై రెక్కీ చేయాల్సిన అవసరం లేదన్న మంత్రులు పవన్ ఇంటి ముందు ఏపీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ కారు ఎందుకు ఉందని, కారులోని వారు అక్కడ దిగి, సంచరించాల్సిన అవసరం ఏముంది చెప్పాలన్నారు. పోలీసులు వైసిపి తొత్తులుగా వ్యవహరించవద్దని, చట్టపరంగా విధులు నిర్వహించాలని సూచించారు. సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ పై తప్పుడు విమర్శలు చేస్తే తగిన పరిహారం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో జనసేన చోడవరం నియోజకవర్గ ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్ రాజు, విశాఖ నార్త్ ఇంచార్జి పసుపులేటి ఉషా కిరణ్, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ లు పాల్గొన్నారు.