అగ్ని ప్రమాద బాధితులను ఆదుకొన్న పేడాడ రామ్మోహన్

ఆమదాలవలస నియోజకవర్గం, పొందూరు మండలం, నరసాపురం గ్రామంలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు హుటాహుటిన బయలుదేరి స్థానిక కార్యకర్తలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే అధికార ప్రభుత్వం ఇళ్లను అనర్హులకు కేటాయించి, ఇటువంటి అర్హులైన పేద వారిని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం జనసేన పార్టీ తరుపున తక్షణ సాయం కింద నిత్యావసర సరుకులను అందచేసి, భవిష్యత్తులో అన్ని రకాలుగా సహాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావుతో పాటు స్థానిక నాయకులు, చిన్నం నాయుడు, రమణ, బాబురావు, సురేష్, శివ, లక్ష్మణ్, వసంత్, హరి, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.