జనసేనలో చేరిన పెమ్మాడి సుధాకర్

విజయవాడ: జనసేన పార్టీ సిద్ధాంతాలకు మరియు పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై నరసాపురానికి చెందిన పెమ్మాడి సుధాకర్ విజయవాడ నోవోటెల్ లో జరిగిన సమావేశంలో నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ మరియు జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు(చినబాబు)ల ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. వీరికి జనసేన పార్టీ పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, తోట నాని, పెమ్మాడి కిరణ్, ఇంటి మురళి మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.