మహిళా హక్కుల ఉద్యమ కెరటం సావిత్రిబాయి ఫూలే

  • జనసేన నాయకులు గురాన అయ్యలు

విజయనగరం: మహిళల విద్యను ప్రోత్సహించి అందుకోసం చారిత్రక పోరాటం నడిపిన ధీశాలి సావిత్రిబాయి ఫూలే అని జనసేన నేత గురాన అయ్యలు కొనియాడారు. సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ వద్ద మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ.. సావిత్రిబాయి ఫూలే ఉపాధ్యాయురాలు మాత్రమే కాదని.. ఆమె రచయిత్రి, కవయిత్రి, సామాజిక కార్యకర్తగా కుల, మత, లింగ బేధాలు లేకుండా సమాజంలోని మహిళలు, బడుగు బలహీన వర్గాల బాగు కోసం శక్తివంచన లేకుండా ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు ఏంటి రాజేష్, అడబాల వేంకటేష్ నాయుడు, పృథ్వీ భార్గవ్, గురజాపు వేంకటేష్, కంది సురేష్ తదితరులు పాల్గొన్నారు.