దస్తావేజు లేఖర్ల పెన్‌ డౌన్‌- మద్దతు తెలిపిన పోలిశెట్టి

రామచంద్రపురం: బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలోని దస్తావేజు పేపర్ల పెన్డౌన్ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు జనసేన పార్టీ ఇంచార్జ్ రామచంద్రపురం పోలిశెట్టి చంద్రశేఖర్ తన సంపూర్ణ మద్దతును పలికారు. దస్తావేజు లేకర్ల నిరసన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రశేఖర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మూర్ఖంగా ఆలోచించి దాదాపు రాష్ట్రంలో 296 సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కార్యాలయంలో 30 వేల మంది దస్తావేజు లేఖర్లు వారి సహాయకులు, రెండు లక్షల పైచిలుకు వారి కుటుంబాల ఆధారపడి వున్నారని, జగన్మోహన్ రెడ్డి ఇవి ఆలోచించకుండా వారి జీవితాలతో అడుకున్నాడని, కొత్త వ్యవస్థ 2.0 ప్రజలకు ఉపయోగ పడని, ఇటు ప్రజలకి దస్తవేజు లేఖర్లకు అన్యాయం చేసి ప్రైవేట్ కాంటాక్ట్ చేతులలో రిజిస్ట్రేషన్ వ్యవస్థను పెట్టాడని ధ్వజమెత్తారు. లేఖర్లకు, ప్రజలకు జనసేన పార్టీ ఎప్పుడూ మద్దతు ఉంటుందని అన్నారు. అనంతరం ర్యాలీగా బయల్దేరి రాజగోపాల్ సెంటర్ నుంచి బయల్దేరి రెవెన్యూ డివజన్ అధికారి కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ, లేకర్లు వెదుళ్లు విజయభాస్కర్ తాడి వీరగోపాలరెడ్డి, తాడి జై భారత్ రెడ్డి, సత్తిగంగిరెడ్డి, అడపా రాంబాబు, చందు, ఆదిత్య, వికాస్, బాల, తేజ, కుమారి, మణికంఠ, ఏలూరి సుబ్బారావు, నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.