జోగీ.. నీకు ఓటు వేసినందుకు ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు

  • జోగి రమేష్ నీకు ఓటు వేసినందుకు పెడన ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు
  • జనం చీ కొడుతున్నా నీకు మాత్రం సిగ్గు రావడం లేదు
  • జోగి రమేష్ నీకు మళ్లీ పెడన నుంచే పోటీ చేసే దమ్ముందా?
  • దమ్ముంటే పెడన నుంచే పోటీచేస్తానని ప్రకటించు
  • జోగి అక్రమాలపై త్వరలో ఛార్జ్ షీట్
  • జోగి అరాచకాలను ఇంటింటికీ తీసుకువెళ్తాం
  • పెడన నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
  • పెడన నియోజకవర్గ జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్

పెడన నియోజకవర్గం: జోగి రమేష్ నీకు ఓటు వేసినందుకు పెడన ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ అన్నారు. పెడన జనసేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్ సుధీర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన వారాహి యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ముఖ్యమంత్రి జగన్ కి, మంత్రి జోగి రమేష్ కి నిద్రపట్టడం లేదు.. నిద్రలేని రాత్రులు గడపడం వల్ల మైండ్ దొబ్బి ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని పరిస్థితికి వచ్చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రాష్ట్రం మొత్తం జగ్గూ భాయ్ ల సమూహం దోచుకుంటుంటే.. మా పెడన నియోజకవర్గానికి మాత్రం చెమ్మ చెక్క జోగి రమేష్ తగులుకున్నాడు.. జోగి రమేష్ చేష్టలు చూసి జనం తేడా గాడు అని చెప్పుకుంటున్నారు.. ఇలాంటి వాడికా మేము ఓటు వేసిందని సిగ్గుతో తలదించుకునే పరిస్థితి.. అయ్యా వైసీపీ కార్యకర్తలారా.. ఆ జోగి రమేష్ ని ఎవరికైనా ఒకసారి చూపించండ్రా బాబు.. నీ వెకిలి వేషాలు, వెర్రి చూపులు నాలుగేళ్లుగా చూస్తున్న జనం నువ్వు సన్నాసివనకున్నారు.. ఇప్పుడు తేడా గాడివి కూడా అని అర్ధమైపోయింది. ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం చేతకాని చవట, దద్దమ్మ. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నామజపంతో మంత్రి పదవి పొందిన జోగి రమేష్ కి ఆయన పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదు.. శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై ఎవరిని నుంచో పెట్టాలో తర్వాత ఆలోచిద్దువుగాని.. అంతకంటే ముందు నీపై నమ్మకంతో రెండుసార్లు అసెంబ్లీకి పంపిన పెడన నియోజకవర్గ ప్రజల బాగు కోసం నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి? వచ్చే ఎన్నికల్లో కూడా పెడనలోనే పోటీ చేస్తానని ప్రకటించే దమ్ము నీకుందా?.. దమ్ముంటే మళ్లీ పెడన బరిలో దిగుతానని ప్రకటన చెయ్యి.. ఇప్పటికే నువ్వూ, నీ అనుచరగణం చేస్తున్న అరాచకాలకు పెడన నియోజకవర్గ ప్రజలు చీ కొడుతున్నారు. నీ నాలుగన్నరేళ్ల పాలనలో నియోజకవర్గానికి ఉపయోగపడే పని ఒక్కటైనా చేశావా? తాగడానికి నీరు లేదు. వైద్యానికి సరైన ఆసుపత్రులు లేవు, రోడ్లు లేవు. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునే దిక్కు లేదు. మడ అడవులు మాయం చేశావు. సముద్ర తీరాన్ని కబళించేశావు, ఇసుక దోచావు, మట్టి దోచావు, పెడన నియోజకవర్గాన్ని పేకాట క్లబ్బులకు, గంజాయికీ అడ్డాగా మార్చేశావు. నువ్వు ఎర్రిపప్ప అని తెలియక ఓటు వేసిన పాపానికి నాలుగేళ్లుగా జనానికి ప్రత్యక్ష నరకం చూపించావు. చమ్మ చక్క జోగి రమేష్.. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేయాలి?, ఆయనపై ఎవరు పోటీ చేయాలి? అనే అంశాలు డిసైడ్ చేయడానికి చాలా సమయం ఉంది.. పెడన నియోజకవర్గ ప్రజలకు అది అవసరం కూడా లేదు. మాకు కావాల్సింది ఒక్కటే.. నాలుగేళ్లలో నువ్వు చేసిన అభివృద్ధి మీద శ్వేతపత్రం విడుదల చెయ్యి.. మంత్రి అయ్యావుగా శ్వేతపత్రం అంటే తెలిసే ఉంటుంది.. శ్వేతపత్రం అంటే ఏంటో తెలియకపోతే పెడన నడిబొడ్డున చర్చకురా?. త్వరలో జోగి రమేష్ అరాచకాలపై జోగి పురాణం పేరిట ప్రజా కోర్టులో జనసేన పార్టీ తరఫున ఛార్జ్ షీట్ విడుదల చేయబోతున్నాం. గ్రామ గ్రామానికి, ఇంటింటికీ జోగి అరచాకాలను తెలియపరుస్తాం. నీకు రోజులు దగ్గర పడ్డాయి. మీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉండు జోగి రమేష్.. రాబోయేది జనసేన పార్టీ ప్రభుత్వమే.. కాబోయే ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారే.. మీరు చేసిన ప్రతి తప్పుకీ లెక్క చెప్పి తీరాల్సిందేనని రామ్ సుధీర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కూనపరెడ్డి రంగయ్య, పోలగాని లక్ష్మీ నారాయణ, పుల్లేటి దుర్గా రావు, పీరిసెట్టి విఘ్నేశ్వర రావు, క్రోవి సుందర రాజు, సయ్యద్ షఫీ, వీరమల్లు శ్రీమన్నారాయణ, వరుదు రాము, గూడూరు మండలం అధ్యక్షులు దాసరి ఉమా సాయి రామ్, కార్యదర్శులు ఎఱ్ఱపోతు అయ్యప్ప, కటకం మహేష్, కొఠారి మల్లి బాబు, యాడంరెడ్డి అంజిబాబు,వన్నెమ్రెడ్డి సాయి కిరణ్, వినోద్, గుడిసీవ సాయి, నవీన్, సింగంసెట్టి అశోక్ కుమార్, నరహరి శెట్టి ప్రసాద్, శివ స్వామి, నంద కిషోర్, జోగి నాయుడు, బంటుమిల్లి మండలం అధ్యక్షులు ర్యాలీ సత్యనారాయన, వెంట్రపాటి నాగబాబు, ఉపాధ్యక్షులు గొట్రు రవి కిరణ్ , దివి శ్రీనివాస్, బాబు, మొచర్ల శర్మ, కొప్పినీటి శివమణి, జన్యువుల నాగబాబు, రయపురెడ్డి వంశీ, వినోద్, ప్రకాష్, వరుదు సబ్బు, దివి శ్రీనివాస్, వరుదు సాయి భాస్కర్, వరుదు ఈశ్వర్, బాకీ నాని మరియు స్థానిక జనసైనికులు పాల్గొన్నారు.