సీఎం ప్రచార ఆర్భాటం కోసం చేస్తున్న గిమ్మిక్కులు ప్రజలు గమనిస్తున్నారు

“వాహన మిత్ర” పథకం కింద బటన్ నొక్కి ఆటో డ్రైవర్ అన్నదమ్ముల ఖాతాల్లో రూ.10 వేలు వేసాను….
2.5+ లక్షల మందికి 1000+ కోట్ల నిధులు విడుదల….

సామాన్యుల మనోగతం: ఈ నిధులతో రహదారులు మరమత్తులు చేయొచ్చు..

మదనపల్లె, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మాట్లాడుతూ.. ఆ చేత్తో కొందరు డ్రైవర్లకు వాహన మిత్ర పథకం డబ్బులు ఇచ్చి, పెట్రోల్, డీజీల్ ధరలు పెంచి ఈ చేత్తో డ్రైవర్లు అందరి దగ్గర డబ్బు లాగేసారు…

కొంతమంది డ్రైవర్లకు డబ్బులు ఇచ్చి రహదారులకు మరమ్మత్తులు చేయకుండా వాహనాలు పాడవడం వల్ల డ్రైవర్లు అందరికీ నష్టం…

కొంతమంది ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇచ్చి రహదారులు బాగుచేయక పోవడం వల్ల ప్రయాణించే అక్క చెల్లెమ్మలు అవ్వా, తాతలకు ఇబ్బంది

వాహన మిత్ర పథకం ద్వారా కొందరు డ్రైవర్లకు డబ్బులు,
అవే డబ్బులు మీ కాంట్రాక్టర్స్ కు ఇచ్చి మంచి రోడ్లు వేస్తే డ్రైవర్లు అందరికీ లాభం…

ముఖ్యమంత్రి గారు సామాన్య ప్రజలు ఆలోచిస్తున్నారు మీరు ప్రచార ఆర్భాటం కోసం చేస్తున్న గిమ్మిక్కులు అర్దం చేసుకుంటున్నారు. అందరికీ ఉపయోగపడే పనులు చేయండి అని జనసేన పార్టీ తరపున దారం అనిత డిమాండ్ చేశారు.