స్వాములా.. సామాన్యులా ఎవరు ముఖ్యం..?: సీఎం ను ప్రశ్నించిన కిరణ్ రాయల్

*రోడ్లు స్వాములకే నా.. సామాన్యులకు లేదా..?

*మీ శిష్యుడు బటన్ రెడ్డి గారికి రోడ్లు గురించి ఓ మాట చెప్పండి స్వామీ.. జనసేన..

తిరుపతిలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గుడ్ మార్నింగ్ సీఎం పేరుతో మూడు రోజులు కార్యక్రమాలు చేపట్టినా స్పందించని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన గురువుగారైన శారదాపీఠంకు కోటి రూపాయలు నిధులు మంజూరు చేసి రోడ్డు వేస్తున్నారని జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ ప్రశ్నించారు.

బుధవారం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నగర అధ్యక్షుడు రాజారెడ్డి, మధుబాబు, డా. బాబు, సుమన్ బాబు, మనోజ్, జివన్, రాజు లతో కలిసి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సామాన్య ప్రజలు కంటే స్వామీజీలు ఎక్కువయ్యారు అని ఆయన ఎద్దేవా చేశారు..

వందేళ్ళ చరిత్ర కలిగిన తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ ఎన్నికలు బుధవారం సజావుగా జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ శ్రీకాళహస్తి, కడప, రైల్వేకోడూరు తదితర రాయలసీమ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఓటు వేశారె తప్ప.. తిరుపతిలో ఉన్న షేర్ హోల్డర్స్ మాత్రం వేయలేకపోయారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయబద్ధంగా నిజాయితీగా ఎలక్షన్ జరిగే లేదని ఈ వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్నవి ఎలక్షన్లు కాదని సెలక్షన్లు మాత్రమే అని కిరణ్ రాయల్ విమర్శించారు.