వైసీపీకి గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు!

  • నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి తీగల చంద్రశేఖర్ రావు

నెల్లూరు: వైసీపీకి గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి తీగల చంద్రశేఖర్ రావు అన్నారు. చిల్లకూరు లోని మిక్స్ డ్ కాలనిలో శనివారం ఎన్.డి.ఏ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, బాధ్యతాయుత సిఎం పదవిలోనుంది పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగత దూషణ చేస్తున్న కోడ్ ను ఉల్లంఘించిన జగన్ పై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు చేస్తున్న జగన్ ను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఎన్.డి.ఏ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం అన్నీ విధాలుగా అభివృద్ధి చెందుతుందని, ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్ కుమార్ కు సైకిల్ గుర్తు, ఎంపీ అభ్యర్థి వర ప్రసాద్ కు కమలం గుర్తు పై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఇంద్రవర్ధన్, సాయి, తిరుపాల్, సచ్చల శ్రీను, వెంకటేశ్వర్లు, అక్బర్, క్రాంతికుమార్, వేణు, శ్రీనాథ్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.