వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

  • వైసీపీ నేతల మాయమాటల్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరు
  • లక్షల కోట్లు అప్పు చేస్తున్నా మౌలిక సదుపాయాలు కల్పించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం
  • ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ నేతలు తట్టా బుట్ట సర్దుకోవటమే
  • సమస్యలపై సమరభేరి కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: నాలుగేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ అరాచకపాలనపై ప్రజలు తీవ్ర అగ్రహావేశాలతో ఉన్నారని, వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేసేందుకు ప్రజలు సంసిద్దంగా ఉన్నారని జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. సమస్యలపై జనసేన సమరభేరి కార్యక్రమంలో భాగంగా ఆదివారం 39వ డివిజన్లోని గుజ్జనగుండ్ల, మారుతీ నగర్ లలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల్ని నేరుగా కలుసుకొని వారి సమస్యల్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ.. ఒక్కఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతలు ఇంత దుర్మార్గపు పాలన చేస్తారని ఎవరూ ఊహించలేదన్నారు. అందిన కాడికి ప్రజాధనాన్ని దోచుకుంటూ నా అక్కాచెల్లెమ్మలు అంటూ వైసీపీ నేతలు చెబుతున్న మాయమాటల్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ఒకవైపు సంక్షేమం పేరుతో అత్యంత విలువైన భవిష్యత్ తరాల సంపదను తెగనమ్మటమే కాకుండా లక్షల కోట్లు అప్పు చేస్తూ కూడా ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి వైసీపీ కార్పొరేటర్ లు ప్రజల్ని రాబందుల్లా పీక్కు తింటున్నారని మండిపడ్డారు. ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలి అంటే అన్ని కార్పొరేషన్ అనుమతులు ఉన్నా కే ట్యాక్స్ ( కార్పొరేటర్ ట్యాక్స్ ) తప్పనిసరిగా కట్టాల్సిందేనని విమర్శించారు. వైసీపీని నమ్మి మోసపోయాం అన్న భావన ప్రజల్లో నెలకొందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ నేతలు తట్టా బుట్టా సర్దుకొవటమేనని ఎద్దేవా చేశారు. ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని, పవన్ కళ్యాణ్ నిజాయితీకి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని నేరేళ్ళ సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, జిల్లా ఉపాధ్యక్షురాలు బిట్రగుంట మల్లిక, నగర ఉపాధ్యక్షుడు కొండూరు కిషోర్ కుమార్, నగర ప్రధాన కార్యదర్శులు ఎడ్ల నాగమల్లేశ్వరరావు, సూరిశెట్టి ఉపేంద్ర, కటకం శెట్టి విజయలక్ష్మి, 39వ డివిజన్ అధ్యక్షుడు చేజర్ల శివ కుమార్, నగర కార్యదర్శి ఎస్.కె రజాక్, నగర సంయుక్త కార్యదర్శి సుంకే శ్రీనివాస రావు, వీరమహిళలు, నిశ్శంకర అనసూయ, బొమ్మకంటి కవిత, శెట్టి వెంకటేశ్వరరావు, గుర్రాల కోటేశ్వరరావు, వెంపటి శ్రీనివాసరావు, షేక్ నాగూర్ మీరా, గుర్రాల ఉమ, త్రిపుర, రవీంద్ర, కోటి, సత్యం, బాషా, నవీన్, నాగరాజు, ఉదయ్, నాని, శ్రీకాంత్, రోశయ్య, గోపి, నాగేశ్వరరావు, నగర కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.