బొబ్బిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేనా? లేక వైసీపీ కార్యకర్తలకే ఎమ్మెల్యేవా?

బొబ్బిలి నియోజకవర్గం: తెర్లాం మండలం, నందిగాం గ్రామంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే శంబంగి చినప్పలనాయుడు గడప గడపకు వైసిపి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుండగా, తెర్లాం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మరడాన రవి ప్రభుత్వ పథకాలు మరియు ఉద్యోగాల విషయంలో ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించగా ఏ పథకాలైనా, ఉద్యోగాలైనా మా పార్టీ వారికి ఇచ్చుకుంటాం కాని మిగతా వాళ్ల సంగతి మాకెందుకంటూ అప్రజాస్వామికంగా మాట్లాడటాన్ని జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు తీవ్రంగా ఖండించారు. ఓవైపు సీఎం జగన్ నగరానికో సొంత ప్యాలెస్ లు, కోట్లలో వ్యాపారాలు, తన చుట్టూ పెత్తందార్లను పెట్టుకుని భయటకు మాత్రం పేదలకు పెత్తందార్లుకు యుద్ధం అంటూ విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. ఇంకో వైపు తన ఎమ్మెల్యే మా కుటుంబీకులు, మా పార్టీ మనుషులుకే పథకాలు, ఉద్యోగాలు ఇచ్చుకుంటాం మా ఇష్టం అంటూ బరితెగించి బహిరంగంగానే చెప్తుండుడం చాలా విడ్డూరంగా ఉంది అంటూ బాబు పాలూరు ఏద్దేవా చేసారు. ఇలాంటి అప్రజాస్వామిక భాషని మరోసారి పునరావృతం చేస్తే, ప్రజల తరపున జనసేన పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, మరడాన రవి, వీరమహిళ యందువ యామిని, బొబ్బిలి నాయకులు పల్లెం రాజా, రామకృష్ణ నాయుడు, ఉమ, సత్య, శివ శంకర్, చీమల సతీష్, రాజు, సాయి తదితర జనసైనికులు పాల్గొన్నారు.