బటన్ ముఖ్యమంత్రి పాలనలో ప్రజలు కష్టాలపాలు

  • జనసేనపార్టీ నాయకులు ఆదాడ మోహనరావు

🔸 జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించిన నాయకులు
🔸 జగన్ పాలనలో ప్రజల కష్టాలపాలు కరపత్రాలు పంపిణీ
🔸 జనసేన సిద్ధాంతాలతో కూడియున్న ప్రవాసాంధ్రుల క్యాలెండర్లు పంపిణీ

విజయనగరం, జనంలోకి జనసేన కార్యక్రమాన్ని పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు మరియు విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, పార్టీ నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు) మంగళవారం ఉదయం రాజీవ్ స్టేడియం రోడ్, ఫైర్ ఆఫీస్ జంక్షన్ వద్దనున్న కూరగాయల సంతవద్ద నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమలో భాగంగా జనసేన సిద్ధాంతాలతో కూడియున్న ప్రవాసాంధ్రుల ఇచ్చిన క్యాలెండర్లు, జగన్ పాలనలో ప్రజలు పడుతున్న అవస్థలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు చేస్తున్న సహాయ కార్యక్రమాల వివరాలతో కూడియున్న కరపత్రాలను మార్కెట్లో ఉన్న ప్రజలకు పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యంగా చేపడుతున్న రైతు భరోసాయాత్ర, ప్రజావాణి, రాష్ట్రంలో పాడైపోయిన రోడ్లపై పోరాటం, కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆర్థికంగా అందిస్తున్న మొదలగు సహాయ చర్యలు ప్రజలకు తెలియజేయాలని అలాగే జగన్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలతీరును కరపత్రాల రూపంలో ప్రజల్లోకి చాలా బలంగా తెలపాలనే ఉద్దేశ్యంతో కరపత్రాల రూపంలో కార్యక్రమాన్ని చేపట్టామని, ముఖ్యమంత్రి బటన్ నొక్కడమే తప్ప ప్రజలకు మేలు జరగట్లేదని ద్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు వంక నరసింగరావు, దంతులూరి రామచంద్రరాజు, యువనాయకులు లోపింటి కళ్యాణ్, ముదిలి శ్రీనివాసరావు, కులదీప్, కుమార్ పాల్గొన్నారు.