ప్రజలు జగన్ రెడ్డిని కలలో కూడా నమ్మరు

  • కార్మికుల శ్రమను దోపిడీ చేయటం దుర్మార్గం
  • గద్దెనెక్కించిన వారికి గద్దె దించటం కూడా తెలుసు
  • జగన్ రెడ్డికి ఓటు – రాష్ట్రానికి చేటు నినాదంతో మారుమ్రోగిన మార్కెట్ సెంటర్
  • ఆకలో జగన్ రెడ్డి అంటూ భిక్షాటన చేసిన జనసేన, కార్మిక సంఘ నేతలు

గుంటూరు: గత ఎన్నికల్లో వైసీపీని గుడ్డిగా నమ్మి అధికారం అప్పచెప్పిన ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని జగన్ రెడ్డి తన అసమర్ధ పాలనతో పూర్తిగా కోల్పోయారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకపాలన దృష్ట్యా జగన్ రెడ్డిని ప్రజలు కలలో కూడా నమ్మే స్థితిలో లేదంటూ విమర్శించారు. 14 రోజులుగా జరుగుతున్న కార్మికుల సమ్మెకు మద్దతుగా నగరపాలక సంస్థ ఎదుట మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జగన్ రెడ్డికి ఓటు – రాష్ట్రానికి చేటు అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆళ్ళ హరి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రతీ సమావేశంలో నా యస్సిలు, యస్టీలు, నా బీసీలు అంటూ పదే పదే మాట్లాడటం ఆయా వర్గాలను మోసం చేయటమేనన్నారు. ఈ రోజు రాష్ట్రంలో జగన్ రెడ్డి నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా రోడ్డేక్కిన వారిలో యస్సిలు, యస్టీలు, బీసీలు లేరా అని ప్రశ్నించారు. మాట్లాడితే నేను మీ బిడ్డను అని జగన్ రెడ్డి అంటుంటారని పేద మహిళల కడుపు మీద కొట్టిన వాడు బిడ్డ ఎట్లా అవుతాడని దుయ్యబట్టారు. కార్మిక సంఘ రాష్ట్ర నేత సోమి శంకరరావు మాట్లాడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర సంపదను విచ్చలవిడిగా దోచుకుంటున్న జగన్ రెడ్డి కార్మికుల శ్రమను కూడా దోచుకోవడం నీచమన్నారు. చాలీచాలని జీతంతో పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పద్నాలుగు రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుంటే జగన్ రెడ్డికి చీమకుట్టినట్లుగా కూడా లేకపోవడం శోచనీయమన్నారు. గద్దె నెక్కించిన వారికి ఆ గద్దెని ఎలా దించాలో కూడా తెలుసున్న విషయాన్ని జగన్ రెడ్డి మరచిపోయినట్లున్నారని దుయ్యబట్టారు. అనంతరం ఆకలో జగన్ రెడ్డి అంటూ జనసేన నేతలు, కార్మికులు మార్కెట్ సెంటర్లో భిక్షాటన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర రెల్లి యువనేత సోమి ఉదయ్ కుమార్, జనసేన నాయకులు సయ్యద్ షర్ఫుద్దీన్, గడ్డం రోశయ్య, తదితరులు పాల్గొన్నారు.