ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది.. ఆ హక్కును ఎవరూ ఆపలేరు

జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన శ్రమదానం కార్యక్రమం ఎన్నో ఆంక్షల మధ్య పూర్తి అయ్యింది. పర్యటన పట్ల పోలీసులు అడ్డు పడడం పవన్ కళ్యాణ్ లో ఆగ్రహం తెప్పించింది. కార్యకర్తలను సభ దగ్గరికి రాకుండా అడ్డుపడ్డారని తెలిసి పవన్ కోపం తెచ్చుకున్నాడు. తన కారుపైకి ఎక్కి పోలీసులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇలాగేనా ప్రవర్తించేది? అంటూ ప్రశ్నించారు. దీంతో జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేకలు వేశారు.

ఇక బాలాజీ సభ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదు ..నిలబడటానికి ఎన్ని దెబ్బలు తిన్నానో మీకేం తెలుసు. ఒడిదొడుకులు, ఓటములు అధిగమించి నిలబడేందుకు వచ్చా.. కుల, మత, వర్గ రహిత సమాజం నిర్మించడం మన ఆకాంక్ష. మనం ఇచ్చే పన్నులు ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయి. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే..గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం . యాక్షన్‌, కెమెరా, కట్‌ అని వెళ్లే వ్యక్తిని కాదని అన్నారు. నా కోసమే ఆలోచిస్తే తిట్టినవారిని కింద కూర్చోపెట్టి నార తీసేవాడిని అని పవన్ అన్నారు.